శ్రీ యేసుండు జన్మించె రేయిలో (2)నేడు పాయక బెత్లెహేము ఊరిలో

శ్రీ యేసుండు జన్మించె రేయిలో (2) 

నేడు పాయక బెత్లెహేము ఊరిలో (2)           ||శ్రీ యేసుండు|| 

 

ఆ కన్నియ మరియమ్మ గర్భమందున (2) 

ఇమ్మానుయేలనెడి నామమందున (2)        ||శ్రీ యేసుండు|| 

 

సత్రమందున పశువులశాల యందున (2) 

దేవపుత్రుండు మనుజుండాయెనందునా (2)  ||శ్రీ యేసుండు|| 

 

పట్టి పొత్తి గుడ్డలతో చుట్టబడి (2) 

పశుల తొట్టిలో పరుండ బెట్టబడి (2)             ||శ్రీ యేసుండు|| 

 

గొల్లలెల్లరు మిగుల భీతిల్లగా (2) 

దెల్పె గొప్ప వార్త దూత చల్లగా (2)               ||శ్రీ యేసుండు|| 

 

మన కొరకొక్క శిశువు పుట్టెను (2) 

ధరను మన దోషములబోగొట్టెను (2)            ||శ్రీ యేసుండు|| 

 

పరలోకపు సైన్యంబు గూడెను (2) 

మింట వర రక్షకుని గూర్చి పాడెను (2)         ||శ్రీ యేసుండు|| 

 

అక్షయుండగు యేసు పుట్టెను (2) 

మనకు రక్షణంబు సిద్ధపరచెను (2)              ||శ్రీ యేసుండు||