శ్రమలందు నీవు – నలిగే సమయములో – ప్రభు నీకు తోడుండుననీ….యోచించలేదా..గమనించలేదా

s 

శ్రమలందు నీవు – నలిగే సమయములో – ప్రభు నీకు తోడుండుననీ….యోచించలేదా..గమనించలేదా….. 

ఇమ్మానుయేలుండుననీ ? 

 

1.శ్రమలందు ఏలియాకు కాకోలముచేత – ఆహారము పంపించలేదా ? 

ఈనాడు నీకు – జీవాహారముతో –  

నీ ఆకలి తీర్చుటలేదా (శ్రమలందు) 

 

2. శ్రమలందు యోసేపును ప్రభువు కరుణించి – రాజ్యాధికారమీయలేదా ?        

ఈనాడు నీదు – శ్రమలన్ని తీర్చి –  

పరలోకరాజ్యమీయలేదా ?(శ్రమలందు)