శుభ దినం – ఇది బహుపావనం – ఈ శుభ దినమెంతో

 

శుభ దినం – ఇది బహుపావనం – ఈ శుభ దినమెంతో 

సంతసం – ఈ శుభ దినమెంతో సంతసం 

1. నిన్ను నన్ను తన కనుపాపలా ఇన్నేళ్ళుగ కాపాడిన 

ప్రభునకు సన్నుతి చేసి – సంగీతముతో 

మనసార చేసె – ఆరాధన సమయము ||నిన్ను|| 

2. మా ఇల్లంతటి- నిజ యజమానికి చల్లని ప్రేమతో 

నడిపిన వానికి శోధన బాధలు – వ్యాధుల బాపి 

సుఖ శాంతులొసగిన – యేసుకే వందనము ||శుభ|| 

3. మా గాయాలను – మాన్పిన వానికి మా కన్నీటిని 

తుడిచిన ప్రభునకు ఏమివ్వగలను – ప్రేమకు ప్రతిగా ఆ…. ఆ 

హృదయార్పణతో – పాడెదను గీతము ||శుభ||