శిశిరానికి తలవాల్చి – ఆకురాల్చిన అవనికి

 

శిశిరానికి తలవాల్చి – ఆకురాల్చిన అవనికి 

చిగురాశలు కల్పించును – వసంతసమీరం 

నిరాశ నిస్పృహతోడ – నీరసిల్లిన మనిషికి 

ప్రభుయేసునందు ఉన్నది – శతవసంతాల సారం 

 

1. అవిధేయతయే పెరిగి – ఆజ్ఞలనతిక్రమించిన 

మనుజాళిని ఆవరించె – పాపపు తిమిరం 

భువిదివి సంధానమై – ఇల నర సంతానమై 

అరుదెంచిన ప్రభు చీల్చెను – నిభిడాంధకారం 

 

2. పిలచుచున్న తండ్రి నుండి – తొలగి తొలగి  

దూరమరిగి చెదరిన మనుజాళికి – మిగిలె శాపభారం 

నిజరక్షణ హేతువై – పరదైసుకు సేతువై 

వెలసిన ప్రభువే చేర్చును – ప్రశాంతతాతీరం