శాశ్వత కృపను నేను తలంచగాకానుకనైతిని నీ సన్నిధిలో

 

శాశ్వత కృపను నేను తలంచగా 

కానుకనైతిని నీ సన్నిధిలో (2)       ||శాశ్వత|| 

 

నా హృదయమెంతో జీవముగల దేవుని 

దర్శింప ఆనందముతో కేక వేయుచున్నది (2) 

నా దేహమెంతో నీకై ఆశించే (2)       ||శాశ్వత|| 

 

దూతలు చేయని నీ దివ్య సేవను 

ధూళినైన నాకు చేయ కృపనిచ్చితివే (2) 

ధూపార్తిని చేపట్టి చేసెద (2)       ||శాశ్వత|| 

 

భక్తిహీనులతో నివసించుటకంటెను 

నీ మందిరావరణములో ఒక్కదినము గడుపుట (2) 

వేయిదినాల కంటే శ్రేష్టమైనది (2)       ||శాశ్వత|| 

 

సీయోను శిఖరాన సిలువ సితారతో 

సింహాసనము ఎదుట క్రొత్త పాట పాడెద (2) 

సీయోను రారాజువు నీవేగా (2)       ||శాశ్వత|| 

 

నూతనమైన ఈ జీవ మార్గమందున 

నూతన జీవము ఆత్మాభిషేకమే (2) 

నూతన సృష్టిగా నన్ను మార్చెను (2)       ||శాశ్వత||