శరణం శరణం నా ప్రియ యేసు

 

శరణం శరణం  నా ప్రియ యేసు  

చెరితినయా నీ దరిని నా దేవా 

ఎన్నో అఘము నొసరించితినీ 

కన్నులే కానక చరియించితిని 

మన్నించుటకే పాత్రుడను కాను 

కనికర పూర్ణుడా కృపనే చూపుమ||శరణం|| 

చెడుగులతో జత చేసితిని 

అడుగులు తడబడి నడయాడితిని 

ఇడుముల పాలై పతనం నొందితిని 

కడకే నా దరి శరణని చేరితి||శరణం|| 

3రక్షణ నొసగి పావన పరచి 

అక్షయ భాగ్యము నొసగితివి 

మోక్ష పదమ్మున నను నడిపితివి 

రక్షకుడా గైకొనుమా వందనం||శరణం|| 

నమ్మితి నయ్య నీ చరణంబుల 

నెమ్మది నొసగుము  నా మదికి 

నమ్మిన వారికీ ఆదరమిచ్చెడి 

సమ్మతుడా నా సదముల విభూడా ||శరణం||