వేదనతో గుండె రగులుచున్నది ఆదరణే లేక

 

వేదనతో  గుండె రగులుచున్నది   ఆదరణే  లేక    

కుములుచున్నది బాధల   వలయాన   చిక్కి   – రోదనచే  బహుగా  సొక్కిమనసు మూగగా  మూల్గుచున్నది 

అపన్యాయాధిపతి   యేసయ్యా   –న్యాయము  తీర్చగ  రావయ్యా  

1.పగవారిముంద  ఘనమైన  విందు  సిద్ధము  చేసేదనంటివే   

పొగలా నను కమ్మిన నా శత్రువు క్రియలు చూచియు మిన్నకుంటివే 

నా పక్షమందు నిలిచి పగతీర్చుము నెమ్మది కలిగించి నా స్థితి మార్చుము 

2.  ేవకులను  ప్రత్యేకించితివే  వారిని  హెచ్చించెదనంటివే   

నీ  సేవకులనే   వేదించువారిని వర్దిల్లనిచ్చుచుంటివే   

అవమానమునే  వారికి  కలుగజేయుము       

నీ ప్రజలను ధైర్యముతో బ్రతుకనీయుము 

3.అరచేతియంద  నన   చెక్కుకుంటివే  కీడేమి  రానీయవంటివే      

చెరపట్టగా   నన్ను  చెలరేగిన  వారిని  ఆటంకపరచకుంటివే   

నమ్మదగిన   దేవా   నను  ఎడబాయకము  

విరోధుల చేతిలో నను పడనియ్యకుము