వేకువ జామున మెలకువ కలిగెను చీకటి రెక్కలు విరిగి కరిగెను

 

వేకువ జామున మెలకువ కలిగెను చీకటి రెక్కలు విరిగి కరిగెను 

నీతి సూర్యుడే మేలుకొలిపెను ఆత్మ దీపమే ఆదరించెను (2) 

1.కనుల కన్నీరు తుడిచివేసును మనసున వేదన తీరిపోయెను 

సడలిన చేతుల బలమునిచ్చెను వడలిన కళ్ళకు జయమునిచ్చెను 

నా యేసు ప్రేమే నను వెంటాడెను నా క్రీస్తు కృపయే నను కాపాడెను 

2.అడవిలో దారి కలుగజేసెను ఎడారిలో నదులు పొంగి పోరిలేన(2) 

ఎండ మావులే నీటి ఊటలై ఎండిన భూములే మడుగులాయెను 

నా యేసు ప్రేమే నను వెంటాడెను నా క్రీస్తు కృపయే నను కాపాడెను