వెలిగింది గగనం ఒక వింత తారతో

 

వెలిగింది గగనం ఒక వింత తారతో 

మురిసింది భువనం ప్రభు యేసురాకతో 

పులకించె ప్రకృతి – పలికించె ప్రస్తుతి 

happy happy Christmas 

happy happy Christmas   

 

1. రాజులరాజు ప్రభువుల ప్రభువు భువికేతెంచెనని 

భూజనులకు బహుమానముగా ఇలలో జనియించెనని 

పరమోన్నతుని ప్రసన్నత ఈ జగతిలో నిండెనని 

వరసుతుడేసుని నవ్వుతో పశువుల పాకయె పండెనని 

 

2. దీనులగాచే దైవకుమారుడు పరమును వీడెనని 

మనుష్యుకుమారుడై కన్య మరియ వడిలో పరుండెనని 

పాపుల బ్రోచే రక్షకుడు యేసయ్యగ వచ్చెనని 

కాపుదలిచ్చే ఇమ్మానుయేలు వెలుగును తెచ్చెనని