వెదకుడి వెదకుడి – యెహోవాను వెదకుడి

 

వెదకుడి వెదకుడి – యెహోవాను వెదకుడి 

    సమయముండగనే – ఆయనను వెదకుడి  

    కృపకాలముననే ఆయనను వెదకుడి (2)  “వెదకు 

1. ఆయన మీకు – దొరుకు కాలమున 

    నీ పూర్ణ హృదయముతో – ఆయనను వెదకినా 

    నీపై జాలితో – నిన్ను క్షమియించును –2 

    తరుణము పోయినా- మరల రాదు –2   “వెదకు 

2. తెల్లవారు జామున – నీ కంఠ స్వరముతో 

    ఉపవాసముతో – కన్నీటి ప్రార్థనతో 

    యెహోవాను వెదకిన – మోక్షము దొరుకును  -2 

    తరుణము పోయినా – మరల రాదు –2      “వెదకు 

3. బాలుడైన యేసుని – జ్ఞానులు వెదికిరి  

    మగ్ధలేని మరియ – యేసుని వెదికెను 

    కన్నీటితో హన్నా – దేవుని వెదికెను  -2 

    తరుణము పోయినా – మరల రాదు  -2    “వెదకు 

4. హిజ్కియ వెదకి – ఆయుస్సు సంపాదించే 

    ఎస్తేరు వెదకి – తన వారిన్‌ రక్షించే 

    దేవునిని నమ్మినవారే – ఆయనను స్తుతియింతురు  -2 

    తరుణము పోయినా – మరల రాదు           “వెదకు