వెదకని నాకు దొరికితివి – నను రక్షింపను వెదికితివి యేసూ

 

వెదకని నాకు దొరికితివి – నను రక్షింపను వెదికితివి యేసూ! 

నను కరుణించితివి 

1. నీ మార్గంబును తొలగితిని – నిన్నెరుగకయే మెలగితిని 

కన్నులు గానక తిరిగితిని – మంటి నేనని మరచితిని ||వెద|| 

2. ఎంతగానో నను ప్రేమించి – ఈ లోకమునకు అరుదెంచి 

దాసుని రూపము ధరియించి – నా పాపములను భరియించి ||వెద|| 

3. నాకై ప్రాణము బెట్టితివి – మధ్యగోడ పడగొట్టితివి 

నీ మందిరముగ కట్టితివి – నీ కొమరునిగ నిలబెట్టితివి ||వెద|| 

4. నీ శక్తితో నను నింపుము – నీ పనికైనను బంపుము 

నిత్యము నన్ను నడిపించుము – నీకు సాక్షిగా నుంచుము ||వెద|| 

5. ఆరాధింతును ఆశ్రయుడా – ఆత్మతోడ సత్యముతోడ 

స్తుతియించెద నిను స్తోత్రార్హుడా – అద్వితీయుడా నా ప్రభువా ||వెదా||