వీనులకు విందులు చేసే యేసయ్యా సు చరిత్ర

 

వీనులకు విందులు చేసే యేసయ్యా సు చరిత్ర 

వేగిరమే వినుటకు రారండి ఓ సోదరులారా 

1.రండి వినారారండి యేసయ్యా ఎవరో తెలుసుకొన రారండి 

నీ పాప భారం తొలగించేది యేసయ్యేనండి 

మోక్షానికి మార్గం చూపించింది యేసయ్యేనండి”వీనులకు 

2.రండి వచ్చి చూడండి యేసయ్య చేసే కార్యములు చూడండి 

నీ వ్యాధి బాధలు తొలగించేది యేసయ్యేనండి 

నీకు శాంతి సుఖములు కలిగించేది యేసయ్యేనండి”వీనులకు 

3.సృష్టి కర్తను మరచావు నీవు సృష్టిని నీవు పూజించ దగునా? 

భూమ్యాకాశములను సృష్టించినది యేసయ్యేనండి 

నిను నూతన సృష్టిగా మార్చేది యేసయ్యేనండి”వీనులకు