విశ్వాస వీరులం క్రీస్తు శిష్యులం – దేవునికే మేం వారసులం పరలోక పౌరులం క్రీస్తు సాక్షులం – దైవ రాజ్యపు

 

విశ్వాస వీరులం క్రీస్తు శిష్యులం – దేవునికే మేం వారసులం  పరలోక పౌరులం క్రీస్తు సాక్షులం – దైవ రాజ్యపు యాత్రికులం  

వెలి చూపుతో కాదు విశ్వాసంతో – మేం నడచెదం ఎప్పుడూ  విశ్వాసపు మంచి పోరాటమే – పోరాడేదం ఇప్పుడు  

జీసస్ ఈస్ అవర్ హీరో – జీసస్ ఈస్ అవర్ హీరో ………..  

విశ్వాస వీరులం క్రీస్తు శిష్యులం – దేవునికే మేం వారసులం 

పరలోక పౌరులం క్రీస్తు సాక్షులం – దైవ రాజ్యపు యాత్రికులం 

 

1.అబ్రహామును దేవుడు పిలిచెను -అశీర్వాదపు వాగ్ధాన మిచ్చెను  

అబ్రహామును దేవుని నమ్మెను – దేవుడతని కది నీతిగా ఎంచెను 

ప్రభువు పిలువగనే ఎందుకో తెలియకనే – కదిలెనుగా అబ్రహాము  

యెహోవ యీరే అని కొడుకును లేపునని -అర్పించి పొందెనబ్రహాము 

విశ్వాసులకు తండ్రయ్యాడు – దేవునికే స్నేహితుడై పేరొందాడు  

విశ్వాస వీరులం క్రీస్తు శిష్యులం – దేవునికే మేం వారసులం  

పరలోక పౌరులం క్రీస్తు సాక్షులం – దైవ రాజ్యపు యాత్రికులం 

 

2.యోసేపుకు దేవుడు కలలిచ్చెను-ఫలించు కొమ్మగా అశీర్వదించెను 

యోసేపు దేవుని ప్రేమించెను – అన్ని వేళల ప్రభు వైపే చూచెను  

గుంటలో త్రోసినను అన్నలుఅమ్మినను-యొసేపు ప్రభునే నమ్మాడు  

ప్రభువే తోడుండా శోధన జయించి – అధిపతిగా ఎదిగినాడు  

బానిస కాస్త రాజైనాడు – ఫరోకే తండ్రి వలే రాజ్యమేలాడు  

 విశ్వాస వీరులం క్రీస్తు శిష్యులం – దేవునికే మేం వారసులం  

పరలోక పౌరులం క్రీస్తు సాక్షులం – దైవ రాజ్యపు యాత్రికులం 

 

3.దానియేలుకు దేవుడు వరమిచ్చెను – కలల భావము వివరింప నేర్పెను  

దానియేలు తన దేవుని ఎరిగెను – ప్రత్యేకముగా జీవించి చూపెను  

రాజుకు మ్రొక్కనని ప్రభువే దేవుడని -దేవుని మహిమను చూపాడు  

సింహపు గుహ అయినా ధైర్యముగాదూకి-సింహాల నోళ్లను మూశాడు 

దానియేలు దేవుడే జీవము గల దేవుడని-రాజు చేత రాజ్యమంత చాటించాడు 

విశ్వాస వీరులం క్రీస్తు శిష్యులం – దేవునికే మేం వారసులం  

పరలోక పౌరులం క్రీస్తు సాక్షులం – దైవ రాజ్యపు యాత్రికులం 

 

4.సౌలును పౌలుగా దేవుడు మార్చెను – దైవ వాక్యపు ప్రత్యక్షత నిచ్చెను 

పౌలు యేసుని అంతట ప్రకటించెను భులోకమంతా సంచారము చేసెను 

క్రీస్తుని యోధునిగా శ్రమలనుసహియించి-దర్శనమును నెరవేర్చాడు  

జీవ వాక్యమును చేత పట్టుకొని – సిలువ సాక్షిగ నిలిచాడు  

తన పరుగును కదా ముట్టించి – విశ్వాసం కాపాడుకొని గెలిచాడు  

విశ్వాస వీరులం క్రీస్తు శిష్యులం – దేవునికే మేం వారసులం 

పరలోక పౌరులం క్రీస్తు సాక్షులం – దైవ రాజ్యపు యాత్రికులం  

వెలి చూపుతో కాదు విశ్వాసంతో – మేం నడచెదం ఎప్పుడూ  

విశ్వాసపు మంచి పోరాటమే – పోరాడేదం ఇప్పుడు          “జీసస్