విశ్వాసీ ఓ విశ్వాసీ నిలబడియున్నావా

 

విశ్వాసీ ఓ విశ్వాసీ  నిలబడియున్నావా  

విశ్వాసీ నీ విశ్వాసములో  జారిపోయావా                  2 

అంతము వరకు నిలబడు వాడే  దీవెన పొందును    2 

దైవ దీవెన పొందును  విశ్వాసీ 

 1అబ్రహమును చూడూ దేవుని మాట నమ్మెను        

ఎక్కడికి వెళ్ళవలయునో తానెరుగకయే వెళ్ళెనూ      2 

కుమారునీ బలినిచ్చుటకు వెనుతిరుగని విశ్వాసము చూడూ2 

ఆ..విశ్వాసమే విశ్వాసులకు తండ్రిగా అతనిని మార్చిందీ ॥విశ్వాసి 

2లోకమంతా పాడైనా నోవహు నీతిని చూడుమ   

మాటెవ్వరు వినకపోయిన దేవుని మాటకు విధేయుడై        2 

నిందలెన్నో భరియించీ ప్రభువు మాట నెరవేర్చెను చూడు ॥2 

ఆ.. విశ్వాసమే కుటుంబానికి రక్షణగా మారిందీ     విశ్వాసీ 

3యేసేపును దానియేలును           

షద్రకమేషకుఅబేద్నగోలును    

ప్రాణాలర్పించుటకైన  వెనుతిరగలేదు ప్రభు కొరకు        2 

సింహముల బోనులో అగ్నిగుండములో వీరిని చూడూ ॥2 

ఆ..విశ్వాసమే  

దేశాధికారులుగా వీరిని మార్చిందీ  విశ్వాసీ