విశ్వాసం తో సాగితే సమస్తమును సాధ్యమే

 

విశ్వాసం తో సాగితే సమస్తమును సాధ్యమే 

క్రీస్తు లో నాకు కలుగును ఎల్లపుడు విజయమే 

నే చేయు ప్రతి పని విశ్వాసంతో-పలికే ప్రతి మాట విశ్వాసంతో 

నడిచే ప్రతి బాట విశ్వాసంతో-జీవించే ప్రతి క్షణం విశ్వాసంతో 

ఎండినబ్రతుకును చిగురింప చేసి –ఫలింప చేయును విశ్వాసం 

నిరాశ బ్రతుకుకు నిరీక్షణనిచ్చి-సమాధానం ఇచ్చును విశ్వాసం 

కష్టనష్టములెన్నెదురైనా అలయక నేను సాగెదను 

ఇబ్బందులు శ్రమలు ఇరుకులు వచ్చిన-జయించి నేను సాగెదను