వివాహమన్నది పవిత్రమైనది

 

వివాహమన్నది పవిత్రమైనది 

ఘనుడైన దేవుడు ఏర్పరచినది 

 

1. ఎముకలలో ఒక ఎముకగా – దేహములో సగ భాగముగా 

నారిగా సహకారిగా – స్త్రీని నిర్మించినాడు దేవుడు 

 

2. ఒంటరిగా ఉండరాదని – జంటగా ఉండ మేలని 

శిరస్సుగా నిలవాలని – పురుషుని నియమించినాడు దేవుడు 

 

3. దేవునికి అతి ప్రియులుగా – ఫలములతో వృద్ది పొందగా 

వేరుగానున్న వారిని – ఒకటిగ ఇల చేసినాడు దేవుడు