విమోచించు నాయకుడు

 

విమోచించు నాయకుడు 

జయమిచ్చుచున్నాడు 

నాలోనే వున్నాడు 

ఎంతో ఆనందం 

1.నేను పాడి పాడి పొగిడి – దినం 

ఆడి ఆడి స్తుతించి – అన్నిచోట్ల 

వెళ్లి తెల్పేదన్ 

నా యేసు సజీవుడనుచు 

2.నన్ను వెదికి వెదికి వచ్చెను 

దరి జేర్చి హత్తుకొనెను 

నా పాపమంత మన్నించి 

క్రొత్త మనిషిలాగ మార్చెను 

3.ప్రేమాభిషేకములచే 

నన్ను నింపి నాడుపుచున్నాడు 

సాతాను శక్తి జయింప 

అధికారం నాకు ఇచ్చెను. 

4.ఎర్ర సముద్రం దాటి పొందున్ 

యొర్దాను త్రొక్కి నడుద్దున్ 

ఏరికోను చుట్టి వచ్చెదన్ 

బూర ఊది నేను గెల్చెదన్