వినవా మనవి యేసయ్యా ప్రభువా శరణం

 

వినవా మనవి యేసయ్యా 

ప్రభువా శరణం నీవయ్యా 

మలినము నా గతం – పగిలెను జీవితం 

చేసుకో నీ వశం          ||వినవా|| 

 

లోక స్నేహమే కోరి దూరమైతిని 

వీడిపోయి నీ దారి ఓడిపోతిని 

విరిగిన మనసుతో నిన్ను చేరాను 

చితికిన బ్రతుకులో బాగు కోరాను 

నన్ను స్వీకరించి నీతో ఉండనీ యేసయ్యా 

నా తండ్రి నీవేనయ్యా       ||వినవా|| 

 

ఆశ ఏది కానరాక బేలనైతిని 

బాధలింక పడలేక సోలిపోతిని 

అలసిన కనులతో నిన్ను చూసాను 

చెదరిన కలలతో కృంగిపోయాను 

నన్ను సేదదీర్చి సంతోషించని యేసయ్యా 

నా దైవము నీవయ్యా        ||వినవా||