విడువను నిను ఎడబాయనని

 

విడువను నిను ఎడబాయనని 

నా కభయ మొసంగిన దేవా – నా కభయ మొసంగిన దేవా 

 

1. నేరములెన్నో చేసి చేసి – దారి తప్పి తిరిగితినయ్యా (2) 

నేరము బాపుము దేవా – నీ దారిని నడుపుము దేవా ||విడువను|| 

 

2. పందులు మేపుచు ఆకలి బాధలో – పొట్టును కోరిన నీచుడనయ్యా 

నీ దరి చేరితినయ్యా నా తండ్రివి నీవెగదయ్యా ||విడువను|| 

 

3. మహిమ వస్త్రము సమాధానపు జోడును నాకు తోడిగితివయ్యా 

గొప్పగు విందులో చేర్చి నీ కొమరునిగా చేసితివి ||విడువను|| 

 

4. సుందరమైన విందులలో పరిశుద్దులతో కలిపితివయ్యా 

నిండుగా నా హృదయముతో దేవ వందనమర్పించేదను ||విడువను||