విడనాడు వాడవుకావు పరలోకతండ్రి నీవు

 

విడనాడు వాడవుకావు పరలోకతండ్రి నీవు 

నను గూర్చి చింతిస్తావు జాగ్రత్త వహియుస్తావు  

నీకొరకు కనిపెట్టుకొని నిబ్బరముగ ఉందును  

నీ దయను పొందుకొని ఇలలో జీవించెదను 

1.నా పాదము నీవు తోట్రిల్లనీయవు  

ఏ నిమిషమైనను కునుకు తీయవు స్థిరమైన  

వాక్యమందు నను పెంచు బోధకుడవు 

2. నా ప్రక్కలో నీవు నీడగా ఉందువు ఏఎండదెబ్బయైన తగులనీయడు బలమైన రెక్కలందు  

ననుదాచు స్నేహితుడవు 

3. నా రాకపోకలో కాపాడుచుందువు 

ఏ ఆపద నాకు కలుగనీయవు స్థిరమైన  

మార్గమందు నను నడుపు నావికుడవు