విజయ గీతముల్ పాడరేక్రీస్తుకు జయ – విజయ గీతముల్ పాడరే

 

విజయ గీతముల్ పాడరేక్రీస్తుకు జయ – విజయ గీతముల్ పాడరే (2) 

వృజిన మంతటి మీద – విజయ మిచ్చెడు దేవనిజ కుమారుని నామమున్హృదయములతో – భజన జేయుచు నిత్యమున్  విజయ॥ 

 

1.మంగళముగ యేసుడేమనకు రక్షణ – శృంగమై మరి నిలచెనునింగిన్ విడిచి వచ్చెనుశత్రుని యుద్ధ – రంగమందున గెల్చెనురంగు మీరగదన – రక్త బలము వలనపొంగు నణగ జేసెనుసాతానుని బల్ – కృంగ నలిపి చీల్చెను ॥విజయ॥ 

 

2.పాపముల్ దొలగింపనుమనలను దన స్వ – రూపంబునకు మార్పనుశాపం బంతయు నోర్చెనుదేవుని న్యాయ – కోపమున్ భరియించెనుపాపమెరుగని యేసు – పాపమై మనకొరకుపాప యాగము దీర్చెనుదేవుని నీతిన్ – ధీరుడై నెరవేర్చెను ॥విజయ॥ 

 

3.సిలువ మరణము నొందియుమనలను దనకై – గెలువన్ లేచిన వానికిచెలువుగన్ విమలాత్మునిప్రేమను మనలో – నిలువన్ జేసిన వానికికొలువు జేతుమెగాని – ఇలను మరువక వానిసిలువ మోయుచు నీ కృపారక్షణ చాల విలువ గలదని చాటుచు ॥విజయ॥