వింతైన తారక వెలిసింది గగనాన

 

వింతైన తారక వెలిసింది గగనాన 

యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన (2) 

జ్ఞానులకే తప్పలేదు ఆ తార అనుసరణ 

దైవమే పంపెనని గ్రహియించు హృదయాన (2) 

మనమంతా జగమంతా 

తారవలె క్రీస్తును చాటుదాం 

హ్యాప్పీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ 

వి విష్ యు హ్యాప్పీ క్రిస్మస్ 

 

ఆకాశమంతా ఆ దూతలంతా 

గొంతెత్తి స్తుతి పాడగా 

సర్వోన్నతమైన స్థలములలోన 

దేవునికే నిత్య మహిమ (2) 

భయముతో భ్రమలతో ఉన్న గొర్రెల కాపరులన్ 

ముదముతో కలిసిరి జనన వార్త చాటిరి     ||మనమంతా|| 

 

ఆ తూర్పు జ్ఞానులు ఆ గొర్రెల కాపరులు 

యేసయ్యను దర్శించిరి 

ఎంతో విలువైన కానుకలను అర్పించి 

రారాజును పూజించిరి (2) 

హేరోదుకు పుర జనులకు శుభవార్త చాటిరి 

అవనిలో వీరును దూతలై నిలిచిరి        ||మనమంతా||