వస్తానని చెప్పినోడురాకుండగ మానబోడు

 

వస్తానని చెప్పినోడురాకుండగ మానబోడు 

సందేహాలన్నీ వీడు-యేసయ్యను రమ్మని పాడు 

అ.పమరనాత యేసయ్య రావయ్యా – వేగమే నన్ను కొనిపోవయ్యా  

 

1.ప్రవచనాలు చెప్పినట్టుగా మొదటిసారి వచ్చినాడుగా     

యేసుమాటలే సత్యాలు- తప్పక  నెరవేరే ఆణిముత్యాలు  

 

2. లేఖనాలు తెలిపినట్టుగా చనిపోయు లేచినాడుగా      

యేసుమాటలే సత్యాలు- తప్పక నెరవేరే ఆణిముత్యాలు 

 

3. శిష్యులతో పలికినట్టుగ  ఆత్మను పంపినాడురా     

యేసుమాటలే సత్యాలు-తప్పక నెరవేరే ఆణిముత్యాలు