వచ్చుచుండెన్‌ త్వరలోనే – రాజుల రాజుగా యేసయ్యా

 

వచ్చుచుండెన్‌ త్వరలోనే – రాజుల రాజుగా యేసయ్యా 

1.తుఫాను వెంబడి తుఫానులు – ఎన్నడు ఎరుగని సునామియు –2 

గుర్తించితివా ఇకనైనా యేసుని రాకడ సూచనలు 

2. వరదల వెంబడి వరదలతో – అనేక ప్రాంతపు కరువులను –2 

గుర్తించితివా ఇకనైనా యేసుని రాకడ సూచనలు 

3. ఎన్నడు లేని రోగములు – ధారుణమైన మరణములు –2 

గుర్తించితివా ఇకనైనా యేసుని రాకడ సూచనలు 

4.భయంకరమైన బాంబులతో – యుద్ధము వెంబడి యుద్ధములు –2 

గుర్తించితివా ఇకనైనా యేసుని రాకడ సూచనలు 

5. అతి తరచుగ భూకంపములు – ధారుణమైన రోధనలు –2 

గుర్తించితివా ఇకనైనా యేసుని రాకడ సూచనలు