వచ్చింది వచ్చింది మధురమైన సమయం

 

వచ్చింది వచ్చింది మధురమైన సమయం 

తెచ్చింది నూతన కాంతుల ఉదయం 

రావయ్యా వరుడా (రావమ్మ వధువా) సుస్వాగతం 

నీ కోసమే ఈ స్వాగత గీతం 

 

1. మల్లెలు పరిమళం చల్లినవేళ – అల్లరి తెమ్మెర తాకినవేళ 

వెల్లువై ఆనందం పొంగినవేళ మెల్లగ నీ పతి దరిచేరగా 

 

2. కోయిల గానాలు వినిపించువేళ-కోరిన ఘడియలు ఎదురైనవేళ 

చామంతులే పలకరించిన వేళ చేయందుకొని సతిని స్వీకరించగా 

 

3. పరలోక వాకిళ్ళు తెరచుకున్నవేళ-పరమాశీర్వాదాలే  

కురియుచున్నవేళ మనసైన నీ వరుడు ఎదురు చూచువేళ 

వినయముగా నీ ప్రియుని సంధించగా