వందనంబొనర్తుమో ప్రభో ప్రభోవందనంబొనర్తుమో ప్రభో ప్రభోవందనంబు

s 

వందనంబొనర్తుమో ప్రభో ప్రభో 

వందనంబొనర్తుమో ప్రభో ప్రభో 

వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా 

వందనంబు లందుకో ప్రభో                  ||వందనం|| 

 

ఇన్ని నాళ్ళు ధరను మమ్ము బ్రోచియు 

గన్న తండ్రి మించి ఎపుడు గాచియు 

ఎన్నలేని దీవెన లిడు నన్న యేసువా 

యన్ని రెట్లు స్తోత్రములివిగో                ||వందనం|| 

 

ప్రాత వత్సరంపు బాప మంతయు 

బ్రీతిని మన్నించి మమ్ము గావుము 

నూత నాబ్దమునను నీదు నీతి నొసగుమా 

దాత క్రీస్తు నాథ రక్షకా                       ||వందనం|| 

 

దేవ మాదు కాలుసేతు లెల్లను 

సేవకాలి తనువు దినములన్నియు 

నీ వొసంగు వెండి పసిడి జ్ఞానమంత నీ 

సేవకై యంగీకరించుమా                     ||వందనం|| 

 

కోతకొరకు దాసజనము నంపుము 

ఈ తరి మా లోటుపాట్లు దీర్చుము 

పాతకంబు లెల్ల మాపి భీతి బాపుము 

ఖ్యాతి నొందు నీతి సూర్యుడా                ||వందనం|| 

 

మా సభలను పెద్దజేసి పెంచుము 

నీ సువార్త జెప్ప శక్తి నీయుము 

మోసపుచ్చు నందకార మంత ద్రోయుము 

యేసు కృపన్ గుమ్మరించుము             ||వందనం||