లోక పాపమును మోసుకెళ్ళిన దేవుని గొర్రె పిల్ల

లోక పాపమును మోసుకెళ్ళిన దేవుని గొర్రె పిల్ల –2 

నీ రక్తమే పాప పరిహారం నీ దేహమె జీవాహారం నీ వాక్యమే మాకు ఆధారం  

నీ నామమే రక్షణకు మూలం నీ విజయమే మాకు …… విజయం  

లోక పాపమును మోసుకెళ్ళిన దేవుని గొర్రె పిల్ల 

1. మొదటి ఆదాముతో పాపం జనియించెను – మరణము సంక్రమించెను –2 

ఆ పాపం పోవాలంటే ఈ మరణం తొలగాలంటే మా వల్ల కానే కాదు పరిశుద్ధుడె రావాలి ….  

ప్రభువా కడపటి ఆదామైనావు – కలువరి బలి పీఠము నెక్కావు  

నీ ప్రాణమే బలిగా అర్పించి 

మా ప్రాణాలను కాపాడావు- మరణాన్నే మ్రింగి వేసావు 

నీ రక్తమే పాప పరిహారం నీ దేహమె జీవాహారం నీ వాక్యమే మాకు ఆధారం  

నీ నామమే రక్షణకు మూలం నీ విజయమే మాకు …… విజయం  

లోక పాపమును మోసుకెళ్ళిన దేవుని గొర్రె పిల్ల 

2. నీవు పొందిన దెబ్బలచే – మాకు స్వస్థత నిచ్చావే మా కోసం చీల్చబడినావే –2 

సూరూపమేమి లేక కురూపివైనావయ్యా – నిను నలుగగొట్టుటకు తండ్రిష్టమాయేనా ….. 

ప్రభువా నిశ్చయముగ మా రోగాలు – భరియించావు నీ దేహములో 

మా వ్యసనములన్నిటి సహియించి 

మా శాపగ్రాహి వైనావు – ఆరోగ్యము మాకు ఇచ్చావు