లోకమును జయించిన విజయము విశ్వాసమే

 

లోకమును జయించిన విజయము విశ్వాసమే – ఈ లోకమును జయించిన విజయము విశ్వాసమే 

విశ్వాసమునకు కర్తయు కొనసాగించునది యేసే –2 

లోకమును జయించిన”… హే 

 

1. ఆవగింజంత విశ్వాసం – నీలో ఉంటే …. (హే) –2 

కొండలైనా కదులును – సంద్రమైన చీలును 

గాలైన అణగి దెయ్యమైనా వదలి – యేసునకే మహిమ తెచ్చును 

విశ్వాసమునకు కర్తయు కొనసాగించునది యేసే –2 

లోకమును జయించిన విజయము విశ్వాసమే ఈ లోకమును జయించిన విజయము విశ్వాసమే…   

 

2. నమ్మిన నీవు దేవుని – మహిమ చూస్తావు … (హూ)-  

మృతులను లేపెడి  – యేసు రాజే జీవము 

మృతమైన లోక జనులను లేప – యేసు వలే సాగి పోవుదాం 

విశ్వాసమునకు కర్తయు కొనసాగించునది యేసే –2 

లోకమును జయించిన విజయము విశ్వాసమే ఈ లోకమును జయించిన విజయము విశ్వాసమే…. హే 

 

3. లేని వాటిని ఉన్నట్టు – పిలుచును ప్రభువు….. (హూ )-2 

విశ్వసించి పలుకుదాం – క్రియలను చూపుదాం 

జీవవాక్కు పలికి   ఆత్మ శక్తి చూపి – గొప్ప గొప్ప పనులు చేయుదాం 

విశ్వాసమునకు కర్తయు కొనసాగించునది యేసే –2 

లోకమును జయించిన విజయము విశ్వాసమే ఈ లోకమును జయించిన విజయము విశ్వాసమే 

 

4. నమ్ము వానికి  సమస్తం – సాధ్యమే ప్రభుతో ….. (హో) – 2 

ప్రభువు ఉన్నాడని – ఫలము ఇస్తాడని 

నీకై ప్రాణం పెట్టి మృతి గెల్చాడన్న వార్త నమ్ము- నీదె జీవం 

విశ్వాసమునకు కర్తయు కొనసాగించునది యేసే –2 

లోకమును జయించిన విజయము విశ్వాసమే ఈ లోకమును జయించిన విజయము విశ్వాసమే… హే