లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు

 

లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు (2) 

లేతునని తా జెప్పినట్లు లేఖనములో పలికినట్లు 

1. భద్రముగ సమాదధిపైన పెద్దరాతిని యుంచిరి భటులు 

ముద్రవేసి రాత్రియంత నిద్రలేక కావలియున్న   లేచి 

2. ప్రభువుదూత పరమునుండి త్వరగదిగి రాతినిపొర్లించి 

భరశి దానిపై కూర్చుండె భయమునొంద కావలివారు  లేచి 

3. ప్రొద్దు పోడవకముందే స్త్రీలు సిద్దపరచిన సుగంధమును 

శ్రద్ధతోడ తెచ్చి యేసుకు రుద్దుదామని వచ్చి చూడ లేచి 

4. చూడవెళ్ళిన స్త్రీలను దూత చూచి యిపుడే వారితోడ 

లేడు గలిలయ ముందుగ పోతున్నాడు అపుడే లేచినాడని 

5. చచ్చిపోయి లేచినాడు స్వామి భక్తుల కగుపడినాడు 

చచ్చినను నను లేపుతాడు చావు అంటే భయపడరాదు 

6. నేను చేసే పనుల నెరుగు నేను నడిచే మార్గమెరుగు 

నేను చెప్పుమాటలెరుగు నేను బ్రతికే బ్రతుకునెరుగు 

7. నేను లేచిన యేసునందు మానక మరినమ్ముకొందు 

తానునాలో యుండినందున దయజేర్చును మోక్షముతోడ 

8. పాపభారము లేదు మనకు మరణభయము లేదు మనకు 

నరక బాధలేదుమనకు మరువకండి యేసు ప్రభుని