లెమ్ము తేజరిల్లుము నీకు – వెలుగు వచ్చియున్నాది

 

లెమ్ము తేజరిల్లుము నీకు – వెలుగు వచ్చియున్నాది 

యెహోవా మహిమ నీపై – ప్రాకాశముగా నుదయించె  “లెమ్ము 

1. జనములు నీదు వెలుగునకు – పరుగెత్తి వచ్చెదరు 

రాజులు నీదు ఉదయ – కాంతీకి వచ్చెదరు            “లెమ్ము 

2. సముద్ర వ్యాపారము – నీవైపు త్రిప్పబడును 

జనముల ఐశ్వర్యము – నీ యెద్దకు వచ్చును          “లెమ్ము 

3. దేవదారు సరళ గొంజి – చెట్లు నా ఆలయమునకు 

తేబడును నీదు పాద – స్థలము మహిమ పరచెదను  “లెమ్ము 

4. నిన్ను శాశ్వతమైన – శోభాతి శయముగ జేతున్‌ 

బహు తరములకు సంతోష – కారణముగా జేసేదన్‌    “లెమ్ము 

5. వారిలో ఒంటరియైనా – వాడు పది వందాలగును 

    ఎన్నీక లేని వాడు – బలమైనట్టి జనమగును  “లెమ్ము