లెక్కించలెని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్

లెక్కించలెని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్
ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసినా మేళ్ళకై

1. ఆకాశమ హకాశముల్ దానిక్రిందున్న ఆకాశము
భూమిలో కనబడునవన్ని ప్రభువా నిన్నే కీర్తించున్

2. అడవిలో నివసించునవన్ని సుడిగాలియు మంచును
భూమిపై నున్నవన్ని దేవా నిన్నే పొగడును

 

3. నీటిలో నివసించు ప్రాణుల్ ఈ భువిలోని జీవరాశులు
ఆకాశమున ఎగురునవన్ని ప్రభువ నిన్నే కీర్తించున్

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *