లెక్కలేని చుక్కలెన్నో చక్కగా వెలుగుచుండ

 

లెక్కలేని చుక్కలెన్నో చక్కగా వెలుగుచుండ (2) 

 చెప్పకుండ వెళ్ళిపోయె చక్కని చుక్క – దుఃఖమే విడిచిపోయె   చక్కని చుక్క (2)… లెక్కలేని 

1. ప్రభువునందు మృతులే మరి ధన్యులని – విభుని చెంత చేరుటయే గమ్యమని     

 ఆలకించెనెక్కడో చక్కని చుక్క – ఆలసింపక వెళ్ళిపోయె చక్కని చుక్క   (2)… లెక్కలేని 

2.దేహమందు నివశించుట వ్యర్ధమని – మోహమంత మరచుట పరమార్ధమని   (2) 

ఆలకించెనెక్కడో చక్కని చుక్క – ఆలసింపక వెళ్ళిపోయె చక్కని చుక్క   (2)… లెక్కలేని 

3. పాపలోకమందు బ్రతుకలేమని -ఆ పరమును చే్రుటయే మేలని    (2) 

 ఆలకించెనెక్కడో చక్కని చుక్క – ఆలసింపక వెళ్ళిపోయె చక్కని చుక్క (2)… లెక్కలేని 

4.యేసు ప్రభువు తిరిగి భువికి వచ్చునని – మృతులనుండి తనను తిరిగి లేపునని(2) 

ఆలకించెనెక్కడో చక్కని చుక్క – ఆలసింపక వెళ్ళిపోయె చక్కని చుక్క                    (2)… లెక్కలేని