రేయింబవళ్ళలోన వెల్లేటి త్రోవలోన

 

రేయింబవళ్ళలోన వెల్లేటి త్రోవలోన ||2|| 

యేసయ్య నేల మరతువు నీవు క్షణంబులోన లోకంబునిడుతువు ||2|| 

 

1.ఎక్కడికోయి నీవు యాత్రాపోయేది ||2|| 

నీవు నీ ఇల్లు స్థిరము కాదు ఒళ్ళు మరచెదవు ||2|| 

ఈలోకం నీది కాదు పరదేశివే నీవు 

వచ్చిన దారినే వచ్చిన దారినే వెళ్లిపోవాలి ||రేయి|| 

 

2.సైతాను దారిలోన చుట్టు ఎడారి నీకు ||2|| 

ఇరుకైన దారిలోన బరువైన కాడిమోయ ||2|| 

ప్రధాన ఖడ్గముతో బయలుదేరాలి 

ప్రభు యేసుని ప్రార్ధించి పూజించి సేవింపరారే ||రేయి||