రేపు మాపు గూడరమ్య మైన గింజల్

 

1.రేపు మాపు గూడరమ్య మైన గింజల్ 

ప్రీతితోను జల్లి వేచియుందము 

కాపుతోడ నుండి దాపు నుండు పంట 

ఏపు మిారఁ పంటఁకోసి కొందము 

||పంట పండగన్ కోసికొందము 

కుంట నీరు పోవఁ కోసికొందము|| 

2.సందియంబు లేల స్వామి సేవ యందు 

వందనంబు తోడ విత్తుచుందము 

కొందలంబు లేక కష్టవృత్తి చేసి 

యందరంబు చేరి యానందింతము 

3.ప్రేమ విత్తనంబుల్ క్షేమయంకురంబుల్ 

ప్రీతిన్ కాలమెల్ల ప్రాంతమంతటన్ 

నేను మెుప్ప నాటి నాయకుండు రాఁగన్ 

నిండు పంటఁకోసం గూర్చుకొందము