రుచి చూచి ఎరిగితిని – యెహోవా ఉత్తముడనియు

 

రుచి చూచి ఎరిగితిని – యెహోవా ఉత్తముడనియు(2) 

రక్షకు నాశ్రయించి – నే ధన్యుడనైతిని (2)          || రుచి చూచి|| 

 

గొప్ప దేవుడవు నీవే – స్తుతులకు పాత్రుడ నీవే(2) 

తప్పక ఆరాధింతున్ – దయాళుడవు నీవే (2)    || రుచి చూచి|| 

 

మహోన్నతుడవగు దేవా – ప్రభావము గలవాడా(2) 

మనసార పొగడెదను నీ – ఆశ్చర్యకార్యములన్ (2)    || రుచి చూచి|| 

 

మంచి తనము గల దేవా – అతి శ్రేష్టుడవు అందరిలో(2) 

ముదమార పాడెద నిన్ను- అతి సుందరడవనియు (2)  || రుచి చూచి|| 

 

కృతజ్ఞతా చెల్లింతున్ – ప్రతి దాని కొరకు నేను (2) 

క్రీస్తుని యందే తృప్తి – పొంది హర్షించెదను (2)      || రుచి చూచి|| 

 

ప్రార్ధింతును ఎడతెగక – ప్రభు సన్నిధిలో చేరి(2) 

సంపూర్ణముగ పొందెదను – అడుగువాటన్నిటిని (2)    || రుచి చూచి||