రావయ్య యేసునాధా మా రక్షణ మార్గము

 

రావయ్య యేసునాధా మా రక్షణ మార్గము 

నీ సేవ జేయ మమ్ము జేపట్టుటకు 

 

హద్దులేక మేము ఇల మొద్దులమై యుంటిమి 

మా కొద్ది బుద్దులన్ని దిద్ది రక్షింపను         ||రావయ్య|| 

 

నిండు వేడుకతోను మమ్ము బెండువడక చేసి 

మా గండంబులన్నియు ఖండించుటకు        ||రావయ్య|| 

 

మేర లేని పాపము మాకు భారమైన మోపు 

నీవు దూరంబుగా జేసి దారి జూపుటకు       ||రావయ్య|| 

 

పాపులమయ్య మేము పరమ తండ్రిని గానకను 

మా పాపంబులన్నియు పారద్రోలుటకు          ||రావయ్య|| 

 

అందమైన నీదు పరమానంద పురమందు 

మేమందరము జేరి యానందించుటకు         ||రావయ్య||