రారాజు జన్మించినాడుఈ అవనిలోన ఆ నాడునీ హృదిలో జన్మించుతాడుస్థిరపరచుకో నీ మదిని నేడు

 

రారాజు జన్మించినాడు 

ఈ అవనిలోన ఆ నాడు 

నీ హృదిలో జన్మించుతాడు 

స్థిరపరచుకో నీ మదిని నేడు (2) 

యేసే దైవం ఈ సత్యాన్ని తెలుసుకో 

యేసే సర్వం నిత్య రాజ్యమును చేరుకో (2)     ||రారాజు|| 

 

ఇదిగో నేను తలుపునొద్ద 

నిలుచుండి తట్టుచున్నాను 

ఎవడైనను నా స్వరమును విని 

తీసినయెడల వచ్చెదను (2) 

అని నిన్ను పిలుచుచున్నాడు 

త్వరగా తలుపును తెరచి చూడు 

చేజార్చకీ అవకాశము నేడు 

రాదీ సమయము ఇంకేనాడు (2)     ||యేసే దైవం|| 

 

నేనే మార్గం నేనే సత్యం 

నేనే జీవం అని అన్నాడు 

నా ద్వారా తప్ప తండ్రి కడకు 

చేరే మార్గం లేదన్నాడు (2) 

ఈ మాటను పరికించి చూడు 

యోచించుము నిజమేదో నేడు 

త్వరలో ప్రభు రానైయున్నాడు 

ఆ లోపే యేసయ్యను వేడు (2)           ||యేసే దైవం||