రాత్రి నేడు రక్షకుండు వెలిసె

 

రాత్రి నేడు రక్షకుండు వెలిసె వింతగా 

నేడెంతో మోదమొందగా – ఈ పాపి రక్షణార్ధమై (2) 

 

లోక పాపమెల్ల తనదు శిరస్సు మోసెను 

లోక నాథుడై మరియకవతరించెను (2) 

ఇతండె దేవుడాయెను (6)           

||రాత్రి|| 

 

బెత్లహేము గ్రామమెంత పుణ్య గ్రామము 

యేసు రాజుకేసిపెట్టె పశుల కొట్టము (2) 

ఈ నాడే మనకు పండగ 

రారండి ఆడి పాడగ (3)            

||రాత్రి|| 

 

ఆకశాన తార ఒకటి బయలుదేరెను 

తూర్పు నుండి జ్ఞానులకు దారి చూపెను (2) 

చిన్నారి యేసు బాబును 

కళ్లారా చూసి మురిసెను (3)            

||రాత్రి|| 

 

పొలములోని గొల్లవారి కనుల ముందర 

గాబ్రియేలు దూత తెలిపె వార్త ముందుగా (2) 

మేరమ్మ జోల పాడగా 

జగాలు పరవశించెగా (3)            

||రాత్రి|| 

 

లోకములో క్రీస్తు ప్రభుని తాకి మ్రొక్కెను 

భూదిగంతముల క్రీస్తు పేరు నిల్చెను (2) 

ఇతండె దేవుడాయెను (6)          

 ||రాత్రి||