రాజ జగమెరిగిన నా యేసురాజా

 

రాజ జగమెరిగిన నా యేసురాజా 

రాగాలలో అనురాగాలు కురిపించిన 

మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను 

1.దీన స్థితియందున సంపన్న స్థితియందున 

నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి యుందునే 

నిత్యము ఆరాధనకు నా ఆధారమా 

స్తోత్రబలులు నీకే అర్పించెద యేసయ్యా 

2.బలహీనతలయందున అవమానములయందున 

పడినను కృంగినను నీ కృప కలిగియుందునే  

నిత్యము ఆరాధనకు నా ఆధారమా 

స్తోత్రబలులు నీకే అర్పించెద యేసయ్యా 

3.సీయోను షాలేము మన నిత్య నివాసము 

చేరుటయే నా ధ్యానము ఈ ఆశ కలిగియుందునే 

నిత్యము ఆరాధనకు నా ఆధారమా 

స్తోత్రబలులు నీకే అర్పించెద యేసయ్యా