రాజుల రాజా జై యేసురాజా జై జై

 

రాజుల రాజా జై యేసురాజా జై జై 

త్వరగా రానున్న మహారాజా జై”3″ 

జైజై…. జైజై…. జైజై…. జైజై…. యేసురాజా జై”3″ 

 

1.భూమి ఆకాశములను కలిగించావు 

జ్ఞానముతో లోకమును స్థాపించావు 

వర్షాలను కురిపించావు వాయువును నడిపించావు “3″జైజై 

 

2.నశియించు పాపులను కరుణించావు 

పరలోకమును విడిచి ఏతెంచావు 

బలియాగము జరిగించావు పరిహారం చెల్లించావు”3″జైజై 

 

3.సాతాను కోరలను పెకిలించావు 

పాతాళ సంకెళ్ళు చేధించావు 

మరణానికి మెడ వంచావు విజయాన్ని సాధించావు”3″జైజై