రాజా నీ సన్నిధి లోనే దొరికెనే ఆనంద మానందమే

 

రాజా నీ సన్నిధి-లోనే 

దొరికెనే ఆనందమానందమే 

జీవా జలముతో పొంగే హృదయమే 

పాడే స్తుతియు స్తోత్రమే 

శ్రమల వేళా నీ ధ్యానమే 

నా గానం ఆధారం ఆనందమే 

నిలువని సిరుల కన్ననూ 

క్షయమౌ ప్రేమ కన్ననూ 

విలువౌ కృపను పొందగన్ – భాగ్యమే 

నిలువని సిరుల కన్ననూ 

క్షయమౌ ప్రేమ కన్ననూ 

విలువౌ కృపను పొందితిన్ – స్తోత్రమే         ||రాజా|| 

 

మరల రాని కాలమల్లె – తరలిపోయే నాదు దోషం 

నిలువదాయె పాప శాపాల భారం (2) 

నీలో నిలిచి ఫలియించు తీగనై 

ఆత్మ ఫలము పొందితినే         ||నిలువని|| 

 

తెలియరాని నీదు ప్రేమ – నాలో నింపే ఆత్మ ధైర్యం 

జీవ జలమై తీర్చెనే ఆత్మ దాహం (2) 

నీకై నిలిచి ఇలలోన జీవింప 

ఆత్మ ఫలము పొందితినే         ||నిలువని||