రాకడ సమయంలో – కడబూర శబ్ధంతోయేసుని చేరుకునే

 

రాకడ సమయంలో – కడబూర శబ్ధంతో 

యేసుని చేరుకునే – విశ్వాసం నీకుందా? (2) 

రావయ్య యేసయ్య – వేగరావయ్యా 

రావయ్య యేసునాథా – వేగమెరావయ్యా (2)       ||రాకడ|| 

 

యేసయ్య రాకడ సమయంలో 

ఎదురేగె రక్షణ నీకుందా? (2) 

లోకాశలపై విజయం నీకుందా? (2)       ||రావయ్య|| 

 

ఇంపైన ధూపవేదికగా 

ఏకాంత ప్రార్థన నీకుందా? (2) 

యేసు ఆశించే దీన మనస్సుందా? (2)       ||రావయ్య|| 

 

దినమంతా దేవుని సన్నధిలో 

వాక్యం కొరకు ఆకలి నీకుందా? (2) 

యేసునాథునితో సహవాసం నీకుందా? (2)       ||రావయ్య|| 

 

శ్రమలోన సహనం నీకుందా? 

స్తుతియించే నాలుక నీకుందా? (2) 

ఆత్మలకొరకైన భారం నీకుందా? (2)       ||రావయ్య|| 

 

నీ పాత రోత జీవితము 

నీ పాప హృదయం మారిందా? (2) 

నూతన హృదయంతో ఆరాధన నీకుందా? (2)       ||రావయ్య|| 

 

అన్నీటికన్నా మిన్నగను 

కన్నీటి ప్రార్థన నీకుందా? (2) 

ఎల్లవేళలలో స్తుతియాగం నీకుందా? (2)       ||రావయ్య||