రాకడ ప్రభుని రాకడరాకడ రెండవ రాకడఏ దినమో ఏ ఘడియో

 

రాకడ ప్రభుని రాకడ 

రాకడ రెండవ రాకడ 

ఏ దినమో ఏ ఘడియో (2) ఎవ్వరు ఎరుగనిది 

రెప్పపాటున కాలమున తప్పక వచ్చునది ||రాకడ|| 

 

నోవాహు దినములలో జరిగినట్లుగా 

లోతు కాలమున సాగినట్లుగా (2) 

పాపమందు ప్రజలంతా మునిగి తేలగా 

లోకమంతా దేవుని మరచియుండగా (2) 

మధ్యాకాశమునకు ప్రభువు వచ్చుగా 

మహిమతో తన ప్రజల చేర పిలుచుగా (2)      ||రాకడ|| 

 

దేవుని మరచిన ప్రజలందరిని 

సువార్తకు లోబడని జనులందరిని (2) 

శ్రమల పాలు చేయను ప్రభువు వచ్చును 

అగ్ని జ్వాలలతో అవని కాల్చును (2) 

వేదనతో భూమినంత బాధపరచును 

తన మహిమను ప్రజలకు తెలియపరచును (2)       ||రాకడ||