రమ్యమైనది నీ మందిరము సౌందర్యమైనది నీ ఆలయం

 

రమ్యమైనది నీ మందిరము 

సౌందర్యమైనది నీ ఆలయం(2) 

అద్భుతమైనది నీ నా పరలోకం 

బహు శ్రేష్టమైనది నీ నా సీయోను పురము(2) 

అ. ప రమ్యమైనది బహు శ్రేష్టమైనది 

నా ఇంటి వారితో నీ సన్నిధిని చేరేదన్ 

నా పూర్ణ హృదయముతోనే నిన్ను సేవింతును(2) 

నీ వాక్యం చేత మమ్మును నింపుమయ్యా 

నీ సన్నిధిలో నిరంతరం నిలుపు మయా(2) 

నీ ఆత్మ శక్తితో నీ సాక్షిగా సాగెదన్ 

నీ సన్నిధి కాంతిలోనే ప్రకాశింతున్(2) 

నీకోసమే ఇలలో నే జీవింతును 

నశియించు వారిని నీ సన్నిధికి చేర్చెదన్(2)