రక్షననే ఓడ తలుపు తెరువబడింది – నాటి కంటే నేడు

రక్షననే ఓడ తలుపు తెరువబడింది – నాటి కంటే నేడు  

మరి చేరువలో ఉంది ఆలస్యం చేయకుండా కేవు తీసుకో – అవకాశం ఉండగానే రేవు చేరుకో నూటిరువది  

వత్సరాల నోవహు సువార్తను 

 

1.లెక్కచేయలేదు మరి వెక్కిరించారు ప్రజలు 

వర్షమెక్కువయింది ఓడ తేలిపోయింది 

తట్టి తడివి చూసినా తలుపు మూయబడింది 

 

2.చిక్కుడు కాయల కూరతో ఒకపూట కూటికొరకై 

జేష్టత్వం అమ్ముకొని బ్రష్టుడైన ఏశావు 

ఒక్క దీవెనైన నాకు దక్కలేదు తండ్రియని సమీపించి  

ఏడ్చినా శాపమే మిగిలింది 

 

3.మీలో ఒక్కరు నన్ను అప్పగింప నున్నారని చెప్పగానే 

ప్రభుని మాట ఒప్పుకోలేదు యూదా 

తప్పుకుని తరలిపోయి తల్లకిందులా పడి 

నట్టనడుమ బ్రద్దలై నశియించినాడు చూడు