రక్షణ ఔన్నత్యం రక్షకుడే తెలుపును-పర్వత శిఖర శ్రేణి వలెనే నిశ్చలమైనది

 

రక్షణ ఔన్నత్యం రక్షకుడే తెలుపును 

పర్వత శిఖర శ్రేణి వలెనే నిశ్చలమైనది  

 

1మలిన వస్త్రమువలెనే -నిండి యుంటిమి నిందలతో  

తండ్రి మాదిరిగా మము వెదకి వచ్చి వింతగా మము రక్షించెను||రక్షణ|| 

 

అరణ్య ప్రదేశములో-పాడైన యెడారిలో 

కనుగొనెను పరామర్శించెన్ కనుపాపవలే గాచెన్||రక్షణ|| 

 

యాకోబు వలే నుంటిమి-ఇశ్రాయేలుగా మార్చెను 

తన స్వాస్థ్యముగా తన భాగముగా తన జనముగానైతిని||రక్షణ|| 

 

4పర్వతములను సృజించినన్-శ్రేష్టమైనవి నిచ్చేన్ 

అబ్రహాం మోషే ఏలియా యేసు ఎక్కిరి శిఖరములు||రక్షణ|| 

 

5పక్షి రాజువలె ప్రభువు -రెక్కలతో మము మోయున్ 

అలసట లేక మము పట్టుకొని ఆకసమున నడుపును||రక్షణ|| 

 

యేసుని సత్యములు-పర్వత శిఖరములు 

పరిపూర్ణమగు ప్రభు రక్షణను పరికింపజేయును||రక్షణ|| 

 

7యెషయా ప్రవచనములు-రక్షణ వివరములు 

శిఖర శ్రేణి యనుభవములు శిఖరముపై పొందుము||రక్షణ||