రక్షకుడు మంగళమే యేసునకుమంగళమే యేసునకు

 

రక్షకుడు మంగళమే యేసునకుమంగళమే యేసునకు – మనుజావతారునకుశృంగార ప్రభువునకు క్షేమాధిపతికి మంగళమే ॥మంగళమే యేసునకు 

1.పరమ పవిత్రునకు వరదివ్యతేజునకు=నిరుపమానందునకు – నిపుణ వేధ్యునకు మంగళమే ॥మంగళమే యేసునకు 

2. దురిత సంహారునకు– వరసుగుణోదారునకుకరుణా సంపన్నునకు– జ్ఞానదీప్తునకు మంగళమే ॥మంగళమే యేసునకు 

3. సత్యప్రవర్తునకు– సద్ధర్మశీలునకునిత్యస్వయంజీవునకు – నిర్మలాత్మునకు మంగళమే ॥మంగళమే యేసునకు 

4. యుక్త స్తోత్రర్హునకు – భక్తరక్షామణికిసత్యపరంజ్యోతి యగు సార్వభౌమునకు మంగళమే ॥మంగళమే యేసునకు 

5. నరఘోర కలుషముల నురుమారంగ నిలకరుదెంచిన మాపాలి- వర రక్షకునకు మంగళమే ॥మంగళమేయేసునకు 

6. పరమ పురివాసునకు – నరదైవ రూపునకు-పరమేశ్వర తనయునకు– ప్రణూతింతుము నిన్ను మంగళమే 

మంగళమే యేసునకు|