రక్షకుడా యేసు ప్రభో స్తోత్రము దేవాస్వచ్చమైన నిత్య ప్రేమ చూపిన దేవా

 

రక్షకుడా యేసు ప్రభో స్తోత్రము దేవా 

స్వచ్చమైన నిత్య ప్రేమ చూపిన దేవా (2)       ||రక్షకుడా|| 

 

సర్వ లోక రక్షణకై సిలువనెక్కెను (2) 

శ్రమ అయిననూ బాధ అయిననూ (2) 

ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా 

క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా 

రక్షకుడా…                      ||రక్షకుడా|| 

 

ఎంచలేని యేసు నాకై హింస పొందెనే (2) 

హింస అయిననూ హీనత అయిననూ (2) 

ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా 

క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా 

రక్షకుడా…                      ||రక్షకుడా|| 

 

ఎన్నడైన మారని మా యేసుడుండగా (2) 

ఉన్నవైననూ రానున్నవైననూ (2) 

ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా 

హల్లెలూయ హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ 

రక్షకుడా…                      ||రక్షకుడా||