రక్షకుండుదయించినాడట – మన కొరకు పరమరక్షకుండుదయించినాడట రక్షకుండుదయించినాడు

రక్షకుండుదయించినాడట – మన కొరకు పరమ 

రక్షకుండుదయించినాడట 

రక్షకుండుదయించినాడు – రారే గొల్ల బోయలార 

తక్షనమున బోయి మన ని – రీక్షణ ఫల మొందెదము ||రక్షకుండు|| 

 

దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు (2) 

దేవుడగు యెహోవా మన – దిక్కు దేరి చూచినాడు ||రక్షకుండు|| 

 

గగనము నుండి డిగ్గి – ఘనుడు గాబ్రియేలు దూత (2) 

తగినట్టు చెప్పే వారికి – మిగుల సంతోష వార్త ||రక్షకుండు|| 

 

వర్తమానము జెప్పి దూత – వైభవమున పోవుచున్నాడు (2) 

కర్తను జూచిన వెనుక – కాంతుము విశ్రమం బప్పుడు ||రక్షకుండు|| 

 

పశువుల తొట్టిలోన – భాసిల్లు వస్త్రముల జుట్టి (2) 

శిశువును గనుగొందురని – శీఘ్రముగను దూత తెల్పె ||రక్షకుండు|| 

 

అనుచు గొల్ల లొకరి కొకరు – ఆనవాలు జెప్పుకొనుచు (2) 

అనుమతించి కడకు క్రీస్తు – నందరికినీ దెల్పినారు ||రక్షకుండు||