రక్తం చిందింపకుండా పాప క్షమాపణ లేనే లేదు

 

రక్తం చిందింపకుండా పాప క్షమాపణ లేనే లేదు…. “2″  

పరిశుద్ధుడేసు శిలువలోనా చిందించెగా పరిశుద్ధ రక్తం “2″  

అ.పయేసు రక్తమే శుద్ధి చేయును పాపమెల్లను కడిగివేయును “2″   “రక్తం”  

1. ఎడ్ల రక్తం వలన కాదు-మేకల రక్తం వలన పోదు…. “2″  

కోడెల రక్తం కానే కాదు-శ్రీ యేసు రక్తమె శుద్ధి చెయున్ “2″     “యేసు  

2. కర్మ కాండల వలన కాదు-పుణ్య కార్యము వలన పోదు…. “2″  

తీర్ధ యాత్రల వలన కాదు-శ్రీ యేసు రక్తమె రక్షించును “2″     “యేసు  

3. పాప రోగికి వైధ్యుడు యేసే-యేసు రక్తమె ఔషదము…. “2″  

సకల రోగుల బాగు చెయును-శక్తి కలిగిన యేసు రక్తం “2″    “యేసు